పవన్‌కళ్యాణ్ పవర్ఫుల్ పంచ్ డైలాగ్
కెమెరామెన్ గంగతో రాంబాబు లో "నేను పిక్చర్ లోకి వస్తే అపోజిషన్ ప్యాక్ అప్" అని పవన్ చెప్పే డైలాగు ఉండబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా... త్వరలో విడుదల కాబోయే డైలాగ్ టీజర్ ట్రైలర్ తో సినిమా అంచనాలు ఆకాశాన్నంటుతాయని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 26న (అంటే ఈ రోజు) విడుదల కానుంది.
అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలియచేసారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన క్రేజీ కాంబినేషన్ పవన్‌కళ్యాణ్, పూరిజగన్నాధ్‌లది. నాటి ‘బద్రి' చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో విదితమే. మళ్లీ ఎప్పుడెప్పుడా ఆ కాంబినేషన్ అని ఎదురుచూసిన అభిమానులకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా కనువిందు చేయనుందీ కాంబినేషన్ . సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ‘పవన్‌కళ్యాణ్ ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు.

Dialogue Superb
ReplyDelete