Saturday, 29 September 2012

కడుపు తెచ్చుకోవద్దన్న దర్శకుడు

కడుపు తెచ్చుకోవద్దన్న దర్శకుడు


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ విషయంలో ఇటీవల ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఆమెతో ‘రామ్ లాలీ' అనే సినిమాకు ప్లాన్ చేసాడు. అయితే త్వరలో కరీనా- సైఫ్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో దర్శకుడు ఓ షరతు పెట్టాడు. ‘రామ్ లీలా' సినిమా పూర్తయ్యే వరకు గర్భం దాల్చ వద్దని కరీనాకు తేల్చి చెప్పాడట.

దర్శకుడు పెట్టిన షరతు నచ్చని కరీనా....రామ్ లీలా సినిమా ఆఫర్ వదులుకుంది. దీంతో వేరే హీరోయిన్ కోసం వేట ప్రారంభించిన సంజయ్ లీలా బన్సాలీ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి వాళ్లను అనుకున్నప్పటికీ చివరకు దీపికా పడుకొనెను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కరీనా ఈ ఆఫర్ వదులుకోవడాన్ని బట్టి చూస్తే...సైఫ్‌తో పెళ్లయిన కొన్ని నెలల్లోనే తల్లికావాలనే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కరీనా వయసు 32 క్రాస్ అయింది. వయసు మరీ ఎక్కువైతే పిల్లలను కనడం కష్టం అనే కారణంగానే పెళ్లయిన వెంటనే గర్భం దాల్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 17 వీరి వివాహం జరుగనుందని తెలుస్తోంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ ఇప్పటికే తన సన్నిహితులు, ఫ్రెండ్స్‌కి అక్టోబర్ 18న దావత్(విందు) ఏర్పాటు చేసారు. నాలుగైదేళ్లుగా సైఫ్-కరీనా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు పెళ్లయి విడాకులయ్యాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కరీనా కూడా గతంలో ఇతర హీరోలతో ఎపైర్ కొనసాగించింది.

No comments:

Post a Comment